నీట్- యూజీ పేపర్ లీకేజీ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుండగా.. విపక్షాలు నిరసన తెలిపాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది.
Nadendla Manohar: జనసేన సభ్యత్వ నమోదులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యూహంతో ముందుకు వెళ్ళాలి.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచి విజయం సాధించాలి..
కడప జిల్లా సమస్యలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తాను అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అవినీతిపై విచారణ చేపడతాం.. ఎంపీగా గెలిచిన వెంటనే కడప స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబుతో చర్చించాం.. యుద్ద ప్రాతిపదికన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారని ఎంపీ సీఎం రమేష్ చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణం అని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
ఎంఏ బేబీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర అనే ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడిన దేశం వైపు మార్చాలని చూస్తున్నారు.. 2025 నాటికి ఇండియాను మైనారిటీ వ్యతిరేక దేశంగా.. అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆయన ఆరోపించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని తెలిపారు.
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు.
Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందిస్తారు.
Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 80 మంది వరకు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. వీరందరూ సభా మర్యాదలు ఎలా పాటించాలన్న దానిపై తరగతులు నిర్వహిస్తాం.. అసెంబ్లీలో సీనియర్ నాయకుల సభలో మాట్లాడిన స్పీచులు ఉన్నాయి.