MP CM Ramesh: కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాలో ఎంపీ సీఎం రమేష్ నాయుడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన దర్గా మజావర్లు.. ఎంపీ రమేష్, కుటుంబ సభ్యులతో కలిసి పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనకాపల్లి ఎంపీగా కడపకు రావడం సంతోషంగా ఉంది.. కడప దర్గాలో ఆశీర్వాదం తీసుకోవడం నా అదృంష్టంగా భావిస్తున్నాను.. కడప జిల్లా వాసులు అనకాపల్లిలో ఎలా గెలుస్తారు అని కొందరు సందేహించారు.. గతంలోనే విజయమ్మ ఓడిపోయారు అని చెప్పారు.. వాళ్ళు వేరు నేను వేరని చెప్పా అని సీఎం రమేష్ వెల్లడించారు.
Read Also: Baba Vanga : భూమి, అంగారక గ్రహాల మధ్య యుద్ధం.. గ్రహాంతరవాసులతో పరిచయం : బాబా వెంగా అంచనా
ఇక, ఇదే జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు గెలిచాడు.. కొందరు కడప జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారు.. మాకు మంచి పేరు ఉంది కాబట్టి గెలిపించారు.. అనకాపల్లి ఎంపీగా గెలిచిన కడప జిల్లా సమస్యలు పరిష్కరిస్తా.. నేను ఎక్కడ ఉన్నా జిల్లా వాసుల సహకారం అందించారు.. కడప జిల్లా సమస్యలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తాను అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అవినీతిపై విచారణ చేపడతాం.. ఎంపీగా గెలిచిన వెంటనే కడప స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబుతో చర్చించాం.. యుద్ద ప్రాతిపదికన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారని ఎంపీ సీఎం రమేష్ చెప్పుకొచ్చారు.