Minister Satya Kumar: నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ఆసుపత్రికి ఆరు డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉంది.
CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.
Mandipalli Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో శాఖల పని తీరుపై సమీక్షించారు.
BC Janardhan Reddy: 2025 జూన్ లోగా రామాయపట్నం పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2019లో సీఎం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. రూ. 4929 కోట్ల వ్యయంతో పోర్ట్ నిర్మాణం కొనసాగుతుంది.
Sathya Kumar: ఆరోగ్య శ్రీ అమలుపై ఏపీ వైద్య మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ ఎక్కడికి పోదు... యధావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు గత 5 ఏళ్లలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో.. అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు.
Amaravathi: రేపు ( శుక్రవారం) అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలోని కట్టడాలను వారు పరిశీలన చేయనున్నారు.
AP Pension Distribution: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండగ జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయిందని అధికారులు తెలిపారు.
AP CM: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు.
CM Chandrababu: సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.