ఈ నెల 10వ తేదీన మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. కాగా, ఈ కేబినెట్ సమావేశంలోనే ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీతో పాటు పీ-4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Chandrababu: బందరు పోర్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పోర్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతికి దగ్గరగా బందరు పోర్టు ఉంటుంది.. బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంది.
YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
పార్లమెంట్ తొలి శీతాకాల సమావేశాలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఈ సమావేశాలు రాజకీయ వేడెక్కే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నిప్పుపుట్టించనున్నాయి. నెక్స్ట్ అంతకు మించిన కొత్త బిల్లులు ప్రభుత్వ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. READ MORE: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం.. మోడీ…
Employees Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ తప్పని సరి చేసింది సర్కార్..
Atchannaidu: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు.
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు.
AP Govt: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలపై 300 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంది.
Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు.
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.