బీహార్ రాష్ట్రంలోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
అనంతపురం జిల్లాలోని రాప్తాడు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారం ఓ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. జగన్ ఓ పెద్ద సైకో అయితే.. రాప్తాడులో పిల్ల సైకో ఉన్నాడు.. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యానుకు ఉరేసుకునే పరిస్థితికి వచ్చారు అని ఆయన ఆరోపించారు.
మంత్రి కేటీఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. పీఎం మోడీ కి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. నిత్యం రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా తెలంగాణ మంత్రి కె.తారకరామారావు హాట్ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్ కి స్పందించారు. ఆ కార్టూన్ ని రిట్వీట్ చేశారు. తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే వుంటానని అది చూసి తట్టుకోలేనివారు దయచేసి తనను…