NDA Alliance Lead in 105 Seats in AP: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) దూసుకుపోతోంది. కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ (88)ను దాటేసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే 105 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇలానే కొనసాగితే కూటమి భారీ మెజారిటీ సాధిస్తుంది.
ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88. పొత్తుల్లో భాగంగా 21 స్థానాల్లో జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా.. మిగిలిన 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ ఉంది. మరోవైపు వైసీపీ పూర్తిగా రేసులో లేకుండా పోయింది. మంత్రులు, మాజీ మంత్రులు ఎదురీదుతున్నారు. మంత్రులు రోజా, బుగ్గన, చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు.