CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం (జూన్ 269న) బీజేపీ- ఏఐఏడిఎంకేలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మతం ప్రమాదంలో ఉందని పదే పదే చెబుతూ రాష్ట్ర ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మధురైలో జరిగిన మురుగన్ సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ అనేక మంది కమలం పార్టీ నాయకులు కులం, మతం పేరుతో తమిళనాడు ప్రజలను విభజించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ పార్టీ జాతీయ, ప్రజా కేంద్రీకృత అంశాలను హైలైట్ చేస్తుండగా.. బీజేపీ, అన్నా డీఎంకే పార్టీలు మతంపై దృష్టి పెట్టాయని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
Read Also: Priests Dance: పూజారుల మందు పార్టీ.. అశ్లీల నృత్యాలతో రచ్చరచ్చ! వీడియోలు వైరల్
ఇక, ప్రజలను ఆకర్షించడానికి వారు మిస్డ్ కాల్స్ లాంటి జిమ్మిక్కులను ప్రయత్నించారని సీఎం స్టాలిన్ తెలిపారు. అది పని చేయకపోవడంతో.. వారు ఇప్పుడు దేవుని పేరును దుర్వినియోగం చేయడం ప్రారంభించారని ఆరోపించారు. కానీ ఇది తమిళనాడు, పెరియార్ భూమి.. రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమి మోసపూరితమైన భక్తికి పడిపోరని చెప్పారు. అన్ని మతాల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. గత నాలుగు సంవత్సరాలలో 3,000 దేవాలయాలకు కుంభాభిషేకం నిర్వహించామని తెలిపారు. చర్చిలు, మసీదుల అభివృద్ధి కోసం రూ. 84 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మత రాజకీయాలు చేస్తున్న వారు దీనిని సహించలేకపోతున్నారు.. మురుగన్ సదస్సులో పెరియార్- అన్నాదురై అవమానించబడినా.. అన్నాడీఎంకే పార్టీ మౌనంగా ఉండటాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు.
Read Also: Yogi Adityanath: కన్వర్ యాత్ర మార్గంలో వ్యాపారులు తమ పేర్లను దుకాణాలపై ప్రదర్శించాల్సిందే
అయితే, ఎన్డీయే కూటమిని మనం ఇప్పుడు ఆపకపోతే, రేపు వారు తమిళనాడును కుల, మతల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వస్తారని సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. బీజేపీ- అన్నా డీఎంకే కూటమికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాలపై భారం పడేలా రూపొందించబడ్డాయని ఆరోపించారు. తమిళనాడుకు రావాల్సిన రూ. 1.70 లక్షలు నిధుల్లో.. 40 శాతం రాష్ట్రం భరించాల్సిందేన్నారు. బీజేపీ పాలిన రాష్ట్రాలు కానీ వాటికి నిధులు సరిగ్గా ఇవ్వబడవు అని గతంలో ఓ కేంద్రమంత్రి అన్నారని గుర్తు చేశారు. కాగా, నిజమైన ప్రమాదం మతానికి కాదు, తమిళనాడులోని ఎన్డీయే కూటమికే అని ఎంకే స్టాలిన్ వెల్లడించారు.