‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర…
‘అన్ స్టాపపబుల్ టాక్ షో’తో నందమూరి బాలకృష్ణ పైన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపం ఎక్కువ, ఫాన్స్ ని కొడతాడు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అంటే ఫన్, ఎనర్జీ, జోష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన ‘అన్ స్టాపపబుల్ షో’లో బాలయ్యని చూసిన వాళ్లు హోస్ట్ గా దుమ్ము లేపుతున్నాడు అనకుండా ఉండలేరు. ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపపబుల్’…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ…
చిరంజీవి బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న బాక్సాఫీస్ వార్ కి మరోసారి రంగం సిద్దమయ్యింది. 2023 సంక్రాంతికి చిరు బాలయ్యలు ‘వాల్తేరు వీరయ్య’ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలు దాదాపు ఒక రోజు గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇందులో చిరు నటిస్తున్న సినిమా పక్కా మాస్ బొమ్మ కాగా బాలయ్య నటిస్తున్న సినిమా ఫ్యాక్షన్ జానర్ లో…
ఆహా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’! నందమూరి నట సింహం బాలకృష్ణ అంత ఓపెన్ గా తన ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీస్ ను ప్రశ్నలు అడుగుతారని కానీ వారు అంతే స్పోర్టివ్ గా తీసుకుని వాటికి జవాబులు చెబుతారని కానీ ఆ ప్రోగ్రామ్ చూసే వరకూ ఎవరూ ఊహించలేదు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, వాటికి ఫిల్మ్ సెలబ్రిటీస్ చెప్పిన సమాధానాల వీడియోస్ చూసి నివ్వెర పోయారు. దాంతో…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది.…
దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ).. నందమూరి బాలకృష్ణ లవ్లో పడిపోయారు.. అదేంటి? బాలయ్యతో ఆర్జీవీ లవ్ ఏంటి? అనుకుంటున్నారేమో… ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోతో ప్రేమలో మునిగితేలుతున్నారు ఆర్జీవీ.. టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.. మోహన్బాబు ఫ్యామిలీ, దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రవితేజ, రానా, నాని, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి.. ఇలా చాలా మందిని తన…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…