చిరంజీవి బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న బాక్సాఫీస్ వార్ కి మరోసారి రంగం సిద్దమయ్యింది. 2023 సంక్రాంతికి చిరు బాలయ్యలు ‘వాల్తేరు వీరయ్య’ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలు దాదాపు ఒక రోజు గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇందులో చిరు నటిస్తున్న సినిమా పక్కా మాస్ బొమ్మ కాగా బాలయ్య నటిస్తున్న సినిమా ఫ్యాక్షన్ జానర్ లో తెరకెక్కింది. తమ స్ట్రాంగ్ జానర్స్ లో సినిమా చేసి హిట్ కొట్టడానికి వస్తున్న చిరు బాలయ్యలు, సంక్రాంతి ఫైట్ ఏ రేంజులో ఉండబోతుందో చిన్న శాంపిల్ చూపించారు.
‘వీర సింహా రెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ మొదలుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్, రెండు సినిమాల నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ నుంచి బాస్ పార్టీ అంటూ బయటకి వచ్చిన సాంగ్ మెగా అభిమానులని ఖుషి చేస్తుంటే, తమన్ మ్యూజిక్ ఇస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి ‘జై బాలయ్య’ సాంగ్ బయటకి వచ్చి నందమూరి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ రెండు పాటల్లో ‘బాస్ పార్టీ’ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ రాబడితే, ‘జై బాలయ్య’ సాంగ్ 7 మిలియన్ వ్యూస్ రాబట్టింది. సాంగ్స్ కి వచ్చిన వ్యూస్ చూస్తుంటే సంక్రాంతి వార్ ఏ హీరోకి వన్ సైడ్ అయిపోదు అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నట్లు ఉంది. అయినా బాక్సాఫీస్ వార్ వన్ సైడ్ అయిపోతే ఏం బాగుంటుంది, చిరు బాలయ్యలు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడితేనే కదా తెలుగు సినీ అభిమానులకి అసలు మజా వచ్చేది, అది కదా అసలు పండగ అంటే. మరి ముందు ముందు రానున్న ట్రైలర్, సాంగ్స్ తో బాలయ్య చిరులు సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని ఇంకెంత ఇంటరెస్టింగ్ గా మారుస్తారో చూడాలి.