Shehbaz Sharif: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానిగా రెండోసారి షహజాబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీల ఉమ్మడి సర్కారుకు షహబాజ్ నాయకత్వం వహించనున్నారు. ఈ రోజు ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశమైంది. మొత్తం 336 మంది సభ్యుల ఓట్లలో షహజాబ్ 201 ఓట్లు పొందారు. మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చెందిన ఒమర్ అయూబ్ ఖాన్ కేవలం 92…
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహకారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్‌ని ఆదివారం ప్రధానిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఒమర్ అయూబ్ ఖాన్‌ని తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేసింది. అయితే, ఇతను గెలిచే పరిస్థితి లేదు.
పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పాకిస్థాన్ ఎన్నికలు (Pakistan Elections) ఎంత గందరగోళంగా జరిగాయో ప్రపంచమంతటికీ తెలిసిందే. ఎన్నికలు జరగడం ఒకెత్తు అయితే.. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లా ఫలితాలు విడుదల కావడం మరొకెత్తు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేశారు.
జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన 30కి పైగా పిటిషన్లను పాకిస్థాన్ కోర్టు మంగళవారం తిరస్కరించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్‌తో సహా పీఎంఎల్-ఎన్ అగ్రనేతల విజయంపై పిటిషన్ సవాల్ చేసింది.
పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్…