Mahakumbh 2025 : మహా కుంభమేళ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి చిహ్నం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భారతదేశ పౌరాణిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునే వేడుక కూడా. గంగా, యమునా సరస్వతి అనే మూడు నదులు కలిసే దివ్య సంగమం ప్రయాగ్‌రాజ్.