* నేడు కువైట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశంలో భారత ప్రధాని పర్యటన
* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు.. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు.. రక్తదానం శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు.. రాష్ట్ర వ్యాప్తంగా అధినేత జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు..
* హైదరాబాద్: రైతు భరోసాపై నేడు అసెంబ్లీలో చర్చ.. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏజెన్సీ పర్యటన.. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని బల్లగరువులో స్థానికులతో సమావేశం. రోడ్ కనెక్టివిటీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం..
* మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* ప్రకాశం : వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు వైసీపీ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ కేక్ కటింగ్ లు, సేవా కార్యక్రమాలు..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం..
* ప్రకాశం : ఇవాళ మూడు ప్రాజెక్టు కమిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక.. కంభం, మోపాడు, పాలేరు బిట్రగుంట ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్న అధికారులు..
* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంతో పాటూ నియోజకవర్గాలలో పార్టీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు
* కాకినాడ: నేడు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం.. హాజరుకానున్న 19 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు
* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. పలుచోట్ల కేక్ కటింగ్ లతో సంబరాలు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు మిస్ రాజమండ్రి, మిసేస్. రాజమండ్రి పోటీలు.. రాజమండ్రి మోరంపూడి సెంటర్‌లో ఉన్న శుభమ్ ఫంక్షన్ హాల్ లో సాయంత్రం ఐదు గంటల నుండి జరగనున్న పోటీలు.. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు..
* పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం.. చెన్నైకి తూర్పు ఈ శాన్యంగా 390.. విశాఖకు దక్షిణాన 430 కి.మీ దూరంలో నెమ్మదిగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడి.. గంటకు 5 కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతూ ఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం
* అనంతపురం : నేడు హెచ్చెల్సీ ప్రాజెక్టు కమిటీ ఛ్తెర్మన్ ఎంపిక.. ఎన్నుకోనున్న సీమ జిల్లాలకు చెందిన డిస్ట్రీబ్యూటరీ కమిటీ ఛ్తెర్మన్లు.
* అనంతపురం : ఈనెల 22 నుంచి బీసీసీఐ కూచ్ బెహర్ అండర్ – 19 ట్రోఫీలో భాగంగా ఆర్డీటీ స్టేడియంలో క్యార్టర్ ఫ్తెనల్ మ్యాచ్.
* విశాఖ: నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు
* కడప : రేవు జిల్లాలో పర్యటించనున్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్…
* కర్నూలు: నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు
* హిందూపురం శ్రీ లక్ష్మి హయగ్రీవ దేవాలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఆండాళ్ అమ్మవారి ప్రాకారోత్సవం
* విజయనగరం: రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేటి షెడ్యూల్.. ఉదయం 11.00 గంటలకు కలక్టరేట్ ఆడిటోరియంలో జరిగే DISHA సమావేశంలో పాల్గొంటారు
* ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత.. రెండ్రోజులుగా చలి తగ్గడంతో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 15.3, మెదక్ జిల్లా టేక్మాల్ 17.2, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట 17.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* నేడు సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహించనున్న TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డి ఐబీ నుంచి అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ.. అనంతరం అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న జగ్గారెడ్డి
* ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా లో తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టిలో 14.9 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూ లో 16.4గా నమోదు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 17 నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* ఖమ్మం: నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
* విజయవాడలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. రాజస్థాన్ పర్యాటనలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,299 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,297 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు