Election Commission: నగరంలో అడుగుపెట్టిన కేంద్ర ఎన్నికల బృందం.. సమీక్ష షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది. మొత్తం 17 మంది అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్షించనుంది. ఇవాళ మధ్యాహ్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. మరోవైపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సీఈసీ బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.
ఈసీ ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అంతేకాదు రాజకీయ పార్టీల ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తారు. రేపు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. ఎల్లుండి వికలాంగ ఓటర్లు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ బృందం మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. డిసెంబర్ 13, 2018న BRS ప్రభుత్వం రద్దు చేయబడుతుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 12లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. డిసెంబర్ 12 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది.మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన ఈసీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Skanda: రామ్ పోతినేని 5 రోజుల్లో హాఫ్ సెంచరీ కొట్టేశాడు!
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!