New Delhi: మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) మరియు ఇతర సెక్షన్ల కింద “న్యూస్‌క్లిక్” వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్తతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రబీర్ పుర్కాయస్తా మరియు హెచ్‌ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని పోలీసు రిమాండ్‌కు తరలించారు. కాగా వీళ్ళు ఏడు రోజులు పోలీసు రిమాండ్ లో ఉండునట్లు సమాచారం. కాగా న్యూస్‌క్లిక్ కి చైనాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న మొత్తం 37 మంది అనుమానితులను (పురుషులు) ప్రాంగణంలో విచారించారు. 9 మంది మహిళా అనుమానితులను వారి ఇళ్లలో విచారించారని మాధ్యమాల సమాచారం.
Read also:Donald Trump: కోర్టు ఉద్యోగిపై ట్రంప్ ఆరోపణలు.. స్పందించిన న్యాయమూర్తి
ఈ కేసు గురించి మాటలాడిన పోలీసులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూస్‌క్లిక్‌కు చైనాతో అనుసంధానించబడిన సంస్థలు రూ. 38 కోట్లు ఇచ్చాయని.. దీంతో పాటు జర్నలిస్టుల ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు సహా పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 5న, అమెరికన్ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అమెరికన్ బిలియనీర్ నవల రాయ్ సింఘం చైనా ప్రచారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాడని.. ఈ నేపథ్యంలో న్యూస్‌క్లిక్‌కు ఆర్థిక సహాయం అందించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఆగస్టు 17న న్యూస్‌క్లిక్‌పై కేసు నమోదు చేయబడింది.