Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, 22 మంది గాయపడ్డారు.
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్ కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 8,31,300కు పెరిగింది.
Bombay High Court: వివాహ సంబంధ వివాదాల్లో పిల్లలను చరాస్థులుగా పరిగణిస్తున్నారని బాంబే హైకోర్టు మంగళవారం ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఒక మహిళలను తన 15 ఏళ్ల కుమారుడితో థాయ్ లాండ్ నుంచి ఇండియాకు తిరిగిరావాలని ఆదేశించింది. పిల్లవాడు తన తండ్రి, తోబుట్టువులను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వైవాహిక వివాదాలు దేశంలో అత్యంత తీవ్రమైన కేసులని జస్టిస్ ఆర్డీ ధనుక, గౌరీ గాడ్సేలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్లలపై తల్లిదండ్రుల హక్కుల కన్నా వారి సంక్షేమమే ముఖ్యమని…
Ajit Pawar: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలకు విస్తరించిందని ఆయన శనివారం అన్నారు. మోడీ గెలిచిన తర్వాత ప్రజాదరణ పొందారని, బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గెలిచిందని,
Delhi High Court: మహిళల ప్రైవసీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాత్ రూంలో స్నానం చేయడమనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అని, ఒక వేళ బాత్ రూం ఇంటి బయట ఉన్నా, తాత్కాలిక నిర్మాణమైనంత మాత్రాన అక్కడ స్నానం చేయడం బహిరంగ చర్యగా పేర్కొనలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Home Theatre Explodes: పెళ్లిలో పెట్టిన గిఫ్టులు ఆశగా ఓపెన్ చేస్తే అది కాస్త పేలి పెళ్లి కొడుకుతో పాటు మరొకరు మరణించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న వ్యక్తి హోం థియేటర్ మ్యూజిక్ సిస్టమ్ గిప్టుగా వచ్చింది. పెళ్లయిన వ్యక్తి, అతడి అన్నయ్య హోం థియేటర్ ఓపెన్ చేసి వైర్‌ను ఎలక్ట్రిక్ బోర్డ్‌కు కనెక్ట్ చేసిన తర్వాత హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఆన్ చేయగా, భారీ పేలుడు…