Corona Positive : భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపెడుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్ బెడద వదిలింది అనుకునే లోపే మళ్లీ రూపు మార్చుకొని విజృంభిస్తోంది. మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో మళ్లీ మునపటి పరిస్థితులు వస్తాయా అని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గతంలో కరోనా వైరస్ సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను వదల లేదు. తాజాగా రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కోవిద్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గవర్నర్‌కు ఒళ్లు నొప్పులు రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
Read Also : MP R Krishnaiah: బీసీల కోసం రెండులక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
దీంతో ఆయనకు పాజిటివ్‌గా తేలినట్లు రాజ్‌భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. గవర్నర్‌తో సన్నిహితంగా ఉన్నవారు, ఆయన్ని కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటంచాయి. కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండవద్దని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలపడం జరిగింది. కరోనా నిబంధనలు పాటించాలని..వైరస్ లక్షణాలు గుర్తించినా, లేక అనుమానం వచ్చినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని రాజ్‌భవన్ తన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్, మాజీ సీఎం వసుందరా రాజేకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.