Man beats 12th wife to death in jharkhand: జార్ఖండ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఇక్కడ విషయం ఏమిటంటే మరణించిన మహిళ, నిందితుడికి 12వ భార్య. వివారాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్ దార్ పంచాయతీలోని తారాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Instagram Reels: ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్ గా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. వ్యూస్ పెరగడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చత్తీస్ గఢ్ లో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ మోజులో పడి ప్రాణాలు…
IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Family suicide to escape alcoholic husband: మద్యం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మద్యం కారణంగా ఏకంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తాగుబోతు భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య, కొడుకు, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్ పూర్ లో జరిగింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పుడిలకు అడ్డుకట్ట వేస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బైబిల్ బోధించినందుకు, విద్యార్థులను చర్చిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది.