హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
NHAI: ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని... దొరికితే పోలీసులు చలాన్ వేస్తారని తెలుసు. కానీ తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే కూడా జరిమానా వేస్తారు.
Andhra Pradesh: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది.…
సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
వరంగల్ నేషనల్ హైవే వెంట యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హెచ్ఎండిఏ గ్రీనరీని పెంబర్తి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాయగిరి వరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ పూర్తి అయింది. అదనంగా 26 కిలోమీటర్లు మల్టీ లేయర్ ప్లాంటేషన్ కు సన్నాహాలు చేస్తోంది. యాదాద్రి హైవే గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవేని కూడా అభివృద్ధి చేయనున్నారు. మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై ఎన్ హెచ్ఏఐ ఆసక్తి కనబరుస్తోంది. యాదాద్రి సెంట్రల్ మిడెన్ ను…
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని.. అలాంటి రోడ్డుకు టోల్ ఛార్జీ వసూలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు టోల్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే రోజా వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-చెన్నై రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు. Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు జాతీయ…