Andhra Pradesh: ప్రత్తిపాడులో రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కాకినాడ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కూడా మరణించాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కంటైనర్‌ను కత్తిపూడి వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ డివైడర్ మీద నుంచి దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Firing in Gold Shop: నాగోల్ ఘటన.. 48 గంటలు గడిస్తే గానీ క్లారిటీ ఇవ్వలేమన్న వైద్యులు
Also Read
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంటైనర్ లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవదహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రెండు లారీలు ఒకదానిలో మరొకటి ఇరుక్కున్నంతగా ఢీకొన్నాయి. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉందని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. ఎస్సై సుధాకర్ ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!