అధ్వాన్నంగా ఉన్న రోడ్డుకు టోల్ ఛార్జీనా? వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని.. అలాంటి రోడ్డుకు టోల్ ఛార్జీ వసూలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు టోల్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే రోజా వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-చెన్నై రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు.
Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
జాతీయ రహదారిలో నిబంధనల మేరకు పనులు జరగలేదని ఎమ్మెల్యే రోజా ఆర్‌అండ్‌బీ దృష్టికి తీసుకువెళ్లారు. సాధారణ నిర్వహణ పనులు కూడా చేయడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని రోజా హెచ్చరించారు. అయితే ఈ అంశంపై తాను సంబంధిత అధికారులతో మాట్లాడానని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి తమిళనాడు జాతీయ రహదారుల పరిధిలో ఉందని.. దీంతో ఈ సమస్య తమ దృష్టికి రాలేదని వివరణ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఆయన ఎమ్మెల్యే రోజాకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!