Sunita Williams Salary: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?.. షాక్ అవ్వాల్సిందే!
- ఐఎస్ఎస్ చేరుకున్న సునీతా విలియమ్స్
- ఈ సంవత్సరం తిరిగి రాలేరని నాసా స్పష్టం
- 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని వెల్లడి
- తాజాగా సునీతా విలియమ్స్ జీతంపై ఆసక్తి కర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోయింగ్ విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ సంవత్సరం తిరిగి రాలేరు. ఈ ఏడాది వ్యోమగాములు తిరిగి రావడం సాధ్యం కాదని నాసా శనివారం (ఆగస్టు 24) తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్ 2024లో బోయింగ్ విమానంలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో లోపం కారణంగా వారి రిటర్న్ వాయిదా పడింది. ఇద్దరు వ్యోమగాములు ఇప్పుడు స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో భూమికి తిరిగి రావాల్సి ఉంటుందని నాసా చీఫ్ బిల్ నెల్సన్ చెప్పారు. స్టార్‌లైనర్ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ లోపభూయిష్టంగా ఉందని, అందువల్ల ఈ వాహనం నుంచి వ్యోమగాములు భూమికి తిరిగి రావడం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు. ఇప్పుడు ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని నాసా తెలిపింది.
READ MORE: Unnatural S*x: ఓరి దరిద్రుడా.. కుక్కతో అదేం పనిరా
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
కాగా.. తాజాగా వ్యోమగాములకు జీతాలుకు సంబంధించి చాలా మందికి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి.. వారు పని చేస్తున్న అంతరిక్ష సంస్థ, అనుభవం, నిర్దిష్ట మిషన్ సమయంలో వారు నిర్వహించే బాధ్యతలను బట్టి మారుతూ ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలో తరచుగా ముందంజలో ఉండే నాసా వ్యోమగాములు సాధారణంగా యూఎస్ ప్రభుత్వ జనరల్ షెడ్యూల్ (GS) ఫెడరల్ పే స్కేల్ కింద వర్గీకరించబడతారు. అంతరిక్ష పరిశ్రమపై మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించే స్పేస్ ఇంపల్స్ షేర్ చేసిన డేటా ప్రకారం.. నాసా వ్యోమగాములు సంవత్సరానికి $152,258.00 (1.27 కోట్లకు పైగా) సంపాదిస్తున్నారు. “ఈ వేతన రేటు 2024 పే షెడ్యూల్‌లను ప్రకారం నిర్ధారించాం. 2025లో ఏదైనా పెరుగుదలను సంభవిస్తే జీతాన్ని సర్దుబాటు చేస్తాం. ” అని నాసా సైట్ లో పేర్కొంది. జీతం, ప్రయోజనాలు, సెలవులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఇదే జీతం సునీతా విలియమ్స్ కి కూడా అందుతుంది. కాగా.. సైనిక నేపథ్యం ఉన్న నాసా వ్యోమగాములకు వేతనాలు భిన్నంగా ఉంటాయి.
READ MORE: Honor killing: పేరెంట్స్ గొంతుకోసి చంపిన కొడుకు.. తల, మొండం వేరు చేసి..!
సునీతా విలియమ్స్ గురించి మరిన్ని విషయాలు..
ఇదిలా ఉండగా.. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధన ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గడించారు. పలు అంతరిక్ష మిషన్లలో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పని చేశారు. విలియమ్స్ మొత్తం 322 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపినందుకు నాసా అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాములలో చోటు దక్కించుకున్నారు. నాసా మిషన్ల సమయంలో ఆమె అనేక ప్రయోగాలు చేశారు. అనేక అంతరిక్ష నడకలను (స్పేస్ వాక్స్) నిర్వహించి రికార్డులను నెలకొల్పారు. విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్‌లోని మెహసానాకు చెందిన భారతీయ సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్. ఆమె తల్లి, ఉర్సులిన్ బోనీ పాండ్యా (నీ జలోకర్), స్లోవేనియన్-అమెరికన్. ఈ ప్రత్యేకమైన సంస్కృతుల సమ్మేళనం ఆమె అసాధారణ విజయాలకు దోహదపడింది అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!