Boeing Starliner: ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసిపోయింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు రావాల్సి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిని చేరుకుంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం లేట్ అవుతుంది.
Read Also: Kejriwal: లిక్కర్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి: సీబీఐ
ఇక, సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమేనని చెప్పుకొచ్చింది. కానీ, నాసా అందుకు ఒప్పుకోకపోవడంతో.. స్టార్‌లైనర్ ఖాళీగా తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన ఆరు గంటల తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో ఈ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. వ్యోమగాముల కోసం స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను రెడీ చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీతా, విల్‌మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిందే. స్పెక్స్ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్‌ఎస్‌కు పంపించే ఛాన్స్ ఉంది. ఈ సెప్టెంబరులోనే ప్రయోగం ఉండొచ్చని తెలుస్తుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, విల్‌మోర్‌ను భూమీ పైకి తీసుకురావాలని నాసా భావిస్తుంది.