మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ పై హీరో శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ వ్యాఖ్యలకు నరేష్ కౌంటర్ ఇచ్చారు. “నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, హీరోగా ఎదగడం నేను చూశాను. నేను కూడా ఇండస్ట్రీలో 50 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మా ప్యానల్‌లో నాకు అపోజిట్ గా పోటీ చేసి ఓడిపోయావు. నాకు ఇండస్ట్రీలో చెడ్డ పేరు లేదు. బైక్‌లు చాక్లెట్లలాగా పిల్లలకు ఇవ్వం. బైక్‌ల విషయంలో జాగ్రత్తలు చెప్పడం తప్పుకాదు. కానీ నీ కామెంట్స్‌తో నేను హర్ట్ అయ్యాను. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. సాయితేజ్ అతివేగంతో బైక్ నడపలేదు. సాయి ధరమ్ తేజ్‌ది ప్రమాదమే. ప్రమాదంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చాను. ఇంకోసారి బైట్స్ ఇచ్చేటప్పుడు అలోచించి ఇవ్వు” అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
Read Also : సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?
శనివారం నరేష్ సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో “నా కుమారుడు నవీన్, తేజ్ సన్నిహితులు. వారిద్దరూ బైక్‌లు తీసుకొని నా ఇంటి నుండి ప్రమాదానికి కొన్ని గంటల ముందు బయలుదేరారు. నేను బైక్‌ల శబ్దం విన్నాను. జాగ్రత్తగా ఉండాలని నేను వారికి చెప్పాలని అనుకున్నాను కానీ వారు అప్పటికే వెళ్లిపోయారు. కొద్దీ రోజుల క్రితం నేను బైక్ రేసింగ్ వద్దని సలహా ఇచ్చాను. నేను కూడా అలాంటి ప్రమాదాలతో బాధపడ్డాను. అప్పటి నుంచి నా తల్లి ఇక బైక్ ల జోలికి వెళ్లోద్దని మాట తీసుకుంది. వీరు పెళ్లి చేసుకొని మంచి భవిష్యత్తును చూడాల్సిన యువకులు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అంటూ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కుమారులు బైక్ ప్రమాదాలలో మరణించిన సంఘటనతో పోల్చారు.
శ్రీకాంత్ ఈ వీడియోను ఖండిస్తూ “సాయి ధరమ్ తేజ్ నాకు తెలిసిన బాధ్యతాయుతమైన యువకుడు. అతను ఎప్పుడూ తన బైక్‌ను హడావిడిగా నడపడు. ఇది చిన్న ప్రమాదం. రోడ్డుపై మట్టి కారణంగా బైక్ నియంత్రణ కోల్పోయింది. కొంతమంది ఇందులోకి రేసింగ్ వంటి వాటిని లాగడం విచారకరం. నరేష్ వ్యాఖ్యలు ఈ క్లిష్ట సమయాల్లో కుటుంబ బాధను మరింత పెంచుతాయి” అని అన్నారు.