రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. దీంతో జైపూర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేటి సాయంత్రం జరిగే డీజీ-ఐజీ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా జైపూర్ చేరుకోనున్నారు.
Mann Ki Baat : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (డిసెంబర్ 31) తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమం.
Ayodhya Airport : ప్రస్తుతం ఎవరి నోట విన్నా అయోధ్య గురించే చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో రామమందిరాన్ని ప్రారంభం, రామ్‌లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇవి ఇలా ఉండగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనలో ఉన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ నేడు అయోధ్యకు రానున్నారు. జనవరి 22న శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయంలో రామ్‌లల్లా పవిత్రోత్సవానికి ముందు మోడీ తన పర్యటనలో అంతర్జాతీయ విమానాశ్రయం, హైవే, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ డబ్లింగ్తో సహా అనేక పెద్ద ప్రాజెక్టులను ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ప్రధానీ నరేంద్ర మోడీ బ్యానర్‌పై అదే పనిగా ఓ వ్యక్తి రాయి విసురుతూ కనిపించాడు. దీంతో అక్కడ భారీగా జనం గుమికూడి అతడిని వింతగా చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్ర నాగపూర్‌లో జరిగినట్టుగా సమాచారం. ఈ వీడియో ఓ వ్యక్తి స్థానిక బస్టాప్ వద్ద ప్రధాని మోదీ బ్యానర్‌ను చూశాడు. బీజేపీ ఏర్పాటు చేసిన వికాసిత్ భారత్ సంకల్ప…
బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజస్ యుద్ధ విమానంలో ఆయన ఓ ట్రిప్ వేశారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో నేడు పర్యటించబోతున్నారు. తాండూరులో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
కాగజ్‌నగర్ పట్టణంలో నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు. బీజేపీ సిర్పూరు అభ్యర్థి డా.పాల్వాయి హరీశ్ బాబు ఏర్పాటు చేసిన ‘రామరాజ్య స్థాపన సంకల్పసభ’లో ఆయన పాల్గొని ప్రసంగించబోతున్నారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.