అమెరికా గాయని మేరీ మిల్బెన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2024లో భారత్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని జోస్యం చెప్పింది.
భారతదేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పీఎం జన్మన్ పథకం(ఆదివాసుల అభివృద్ధి పథకం) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని ఆరంభించనున్నారు.
నరేంద్రమోడీ రాక ముందు తెలంగాణలో ఐఎస్ఐ ఏజెంట్లు ఉండేవారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్ లలో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, పాకిస్థాన్ ఐఎస్ఐ భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందన్నారు. ఇప్పుడు భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK 47 లు…
Ram Mandir : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM), దేశంలోని చాలా మంది ముస్లింలు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.
India-Maldives Relations: భారత్తో కొనసాగుతున్న వివాదం మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్సి) పార్టీ ఓడిపోయింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాసిక్ కాలారామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మాట్లాడుతూ.. ఇవాళ నాసికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ నాసిక్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
Kishan Reddy: ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులు ప్రారంభించడం గిన్నీస్ రికార్డు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారాలన్నారు. నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మాణం చేసిందన్నారు కిషన్ రెడ్డి. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా…