పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో వాంజినాధన్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన…
PM-KISAN Funds Release: దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా ఇచ్చే ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 9.4 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశారు. ఈ రైతులందరి ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2000 బదిలీ చేశారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు…
దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి దక్షిణ తైవాన్ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. ఇక భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్‌సియంగ్‌ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని రెండో రోజు కూడా మూసివేశారు.…
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెప్తుంది.. కానీ, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో సంభాషించారు. పశ్చిమాసియాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు.
మూసీ ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి.. మూసీ ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు. హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. అనవసరంగా మూసి సుందరీకరణ అంటున్నారు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యా నించారు. కాంగ్రెసు పార్టీ అంటే ఆపన్న హస్తం అంటారు…కానీ ఇది భస్మాసుర హస్తం గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ…
సీబీఐకి అనుమతి నిరాకరణ.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య…
పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు.