వరద బాధితులకు గుడ్‌న్యూస్.. 4 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ.. వరద బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు…
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు.
USA: అమెరికా డెలావర్‌లో జరగబోయే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి ‘‘క్వాడ్ ’’ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ బయలుదేరాడు. అయితే, అమెరికాలో మోడీ అడుగుపెట్టే కొన్ని గంటల ముందు వైట్‌హౌజ్ అధికారులు ఖలిస్తానీ మద్దతు గ్రూపులతో సమావేశమైంది. ‘‘అమెరికా గడ్డపై ఏదైనా అంతర్జాతీయ దురాక్రమణ నుంచి రక్షణ’’ ఇస్తామని సదరు సిక్కు గ్రూపులకు వైట్‌హౌజ్ అధికారుల నుంచి హామీ వచ్చింది. అమెరిలో ఉన్నప్పుడు అమెరికన్ పౌరులను హాని నుంచి రక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య చైనా, భారత్ మధ్య జరిగింది. భారత జట్టు ఆరోసారి ఫైనల్ ఆడుతుండగా, చైనాకు ఇది తొలి ఫైనల్. చైనా జట్టు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించి టీమ్ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్‌ను కైవసం…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో ప్రభుత్వం రాణి కుముదిని నియమించింది. 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు.
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య…