Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
- అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
- 97వ బర్త్‌డే జరుపుకుంటున్న రాజకీయ కురువృద్ధుడు అద్వానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే.అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీ శుక్రవారం (నవంబర్ 8) 97వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్ చెప్పారు. అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ.. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ అగ్ర నేతలంతా అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ కూడా.. అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అద్వానీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అద్వానీ బీజేపీలో సీనియర్ నాయకుడు. 1927, నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.
2024 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో మార్చి 30న జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోవడంతో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మార్చి 31న స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసింది. ఇటీవల పలుమార్లు అద్వానీ అనారోగ్యానికి గురయ్యారు. తిరిగి కోలుకుని ఇంటి దగ్గరే ఉంటున్నారు.
Went to Advani Ji's residence and wished him on his birthday. pic.twitter.com/eXU4mAn6gB
— Narendra Modi (@narendramodi) November 8, 2024
Delhi: Haryana CM Nayab Singh Saini met and extended birthday greetings to veteran BJP leader LK Advani at his residence today.
(Pics: CM Nayab Saini's social media handle 'X') pic.twitter.com/vAUucN9EjA
— ANI (@ANI) November 8, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!