PM Modi: ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన మోడీ.. తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది.
READ ALSO: El Choro: డ్రగ్ డాన్ ఖతం.. ఇప్పుడు ఆ గ్యాంగ్‌కు కొత్త బాస్ ఎవరో తెలుసా?
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
తొమ్మిదేళ్ల తర్వాత మొదటిసారి..
ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఇజ్రాయెల్ పార్లమెంటును (నెస్సెట్) ఉద్దేశించి ప్రసంగించబోతున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. మోడీ ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కూడా కలుస్తారు. అలాగే పవిత్ర నగరమైన జెరూసలేంను సందర్శించనున్నారు. భారత్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన అత్యంత కీలకం కానుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటన రెండు దేశాల స్నేహ బంధంలో ఒక కొత్త అధ్యాయంగా నిలవనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!