నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సురేశ్ షెట్కార్‌కు టికెట్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్.. తాజాగా సంజీవ్‌రెడ్డికి ఇస్తున్నట్లు వెల్లడించింది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇక్కడ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవ్‌రెడ్డి మధ్య ఒక్క క్షణం పడటం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తండ్రుల వారసత్వంతో రాజకీయం చేస్తూ.. దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదలైన జగడం…
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట పది మంది అస్వస్థత కాగా తరువాత ఒక్కొక్కరుగా విద్యార్థులు అస్వత్తతకు గురయ్యారు.
ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ బంగారు భారత దేశాయాన్ని తయారు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.. నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన ఆయన.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు…
ఇంటి పెద్ద ఎమ్మెల్యేగా ఉంటే.. కుటుంబసభ్యులు నియోజకవర్గంలో పెత్తనం కామన్. సాగినంత కాలం పర్వాలేదు. శ్రుతి మించిందో రచ్చ రచ్చే. ఆ నియోజకవర్గంలోనూ అదే జరుగుతోందట. ఎమ్మెల్యే భార్య, కుమారుడు షాడోలుగా చక్రం తిప్పుతున్నారట. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం. ఖేడ్‌లో ఎమ్మెల్యే భార్య షాడోగా ఉన్నారా? ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్. ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్‌ఎస్ నేత భూపాల్‌రెడ్డి. ముందు నుంచీ రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబం కావడం వల్లో ఏమో.. భూపాల్‌రెడ్డి…
అదృష్టం ఎలా ఎవర్ని వరిస్తుందో తెలియదు. ఒక్కోసారి అనుకోకుండానే అలా కలిసి వస్తుంటాయి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా చేతిదాకా వచ్చింది చేయిదాటిపోతుంది. కొంతమందికి పోలం దున్నుతుంటే అనుకోకుండా లంకెబిందులు లేదా వజ్రాలు దొరుకుతుంటాయి. అయితే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కుపల్లి గ్రామానికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు తనకున్న పొలంలో దున్నుతుండగా భారీ గణపతి విగ్రహం, పీఠం బయటపడ్డాయి. పెద్దదైన గణపతి విగ్రహం బయటపడటంతో రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా వర్షాధార…