అదృష్టం ఎలా ఎవర్ని వరిస్తుందో తెలియదు. ఒక్కోసారి అనుకోకుండానే అలా కలిసి వస్తుంటాయి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా చేతిదాకా వచ్చింది చేయిదాటిపోతుంది. కొంతమందికి పోలం దున్నుతుంటే అనుకోకుండా లంకెబిందులు లేదా వజ్రాలు దొరుకుతుంటాయి. అయితే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కుపల్లి గ్రామానికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు తనకున్న పొలంలో దున్నుతుండగా భారీ గణపతి విగ్రహం, పీఠం బయటపడ్డాయి. పెద్దదైన గణపతి విగ్రహం బయటపడటంతో రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా వర్షాధార పంటలైన పత్తి, కంది, మినుము, పెసర వంటివి సాగుచేస్తున్నానని, కానీ ఈసారి వర్షాలు బాగా కురవడంతో సమృద్దిగా నీరు అందుబాటులో ఉండటంతో మాగాణి పంట వేయడానికి నిర్ణయించుకొని ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా గణపతి విగ్రహం, పీఠం బయటపడినట్టు అనంతరావు దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.
Read: ప్రశ్నిస్తే కేసులా..?.. అఖిలప్రియ ఫైర్