Food Poisoning: కడుపు పట్టుకొని ఏడుస్తున్న విద్యార్థులు.. 35 విద్యార్థులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poisoning: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట పది మంది అస్వస్థత కాగా తరువాత ఒక్కొక్కరుగా విద్యార్థులు అస్వత్తతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 35 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఉదయం టిఫిన్ లో ఏమైనా పురుగులు పడ్డాయా లేదా రాత్రి తినే అన్నంలో ఏమైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా వివరాలు స్పష్టంగా తెలియాల్సి వుంది. విద్యార్థులకు తీవ్రంగా కడుపునొప్పి వస్తుండటంతో కడుపును గట్టిగా పట్టుకుని ఆసుపత్రిలో కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా మిన్నంటింది.
గతంలో సెప్టెంబర్ 20న కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిన్న రాత్రి భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ బాగుండట్లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. వాంతులతో విద్యార్థులు కడుపునొప్పి ఎక్కువగా వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు.
Also Read
అదేనెల 6న తేదీన వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనవడంతో.. వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే వారిలో 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా వుండంటతో.. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?