వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్‌తో రోజా తమ మేడమ్‌పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరిని.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. రాజకీయాలు నేను మాట్లాడను…
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా సంభవించిన వరదలతో చాలామంది నష్టపోయారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 20న తిరుపతిలో పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కాగా వరదల్లో మృతి చెందిన 48 మంది…
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ ఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నారా లోకేష్, ఆయన బృందం నాతో నా కుటుంబంపై చేసిన కామెంట్లకు ఎమోషన్‌లగా ఒక మాట అనబోయి మరో మాట అన్నానన్నారు. అయితే ఈ విషయంలో తాను…
పద్మశ్రీ సిరివెన్నెల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు. అయితే సిరివెన్నెల మరణం సినీపరిశ్రమకు తీరని లోటు అని నారా భువనేశ్వరి అన్నారు. సీతారామశాస్త్రి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఈ మధ్యే ఏపీలో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టమంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసింది మానవ తప్పిదం..భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ఓ పది మందిని మా ఇంటికి పంపితే నేనెందుకు క్షమాపణ చెప్పడం ఏమిటి..? అతని భార్యను అతను అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటాడేమిటి…?అని నిలదీశారు. తాను సెక్యూరిటీ పెంచుకోవడం లేదు..నేను వదిలేస్తా..ఆయన్ని…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుబట్టారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని తెలిపారు. అక్కాచెల్లెళ్లుగా తామిద్దరం ఎన్నో విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Read Also: పదవి…