రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..
వరదలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు మీకు అండగా మేము ఉన్నాం అంటూ ముందుకు కదిలింది ప్రభుత్వ యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా, అధికార యంత్రాగంన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు కూడు, గూడు, నీరు, పాలు వంటి కనీస అవసరాలు సమకూరుస్తున్నారు. వరద భాదితులకు సహాయార్థం ఎవరికి తోచినంతగా సాయం చేయాలనీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీపరిశ్రమ తమ దాతృత్వాన్ని చాటుకుంది. Also…
నేను ముఖ్యమంత్రి భార్యగా ఇక్కడికి రాలేదు.. మీలో ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను అని వ్యాఖ్యానించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు రామకుప్పం గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి.. గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!' అంటూ ట్వీట్ చేశారు.
నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.