వరదలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు మీకు అండగా మేము ఉన్నాం అంటూ ముందుకు కదిలింది ప్రభుత్వ యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా, అధికార యంత్రాగంన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు కూడు, గూడు, నీరు, పాలు వంటి కనీస అవసరాలు సమకూరుస్తున్నారు. వరద భాదితులకు సహాయార్థం ఎవరికి తోచినంతగా సాయం చేయాలనీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీపరిశ్రమ తమ దాతృత్వాన్ని చాటుకుంది.
Also Read: Mega Star: వరద భాదితులకు అండగా ‘చిరు’ మెగా సాయం ఎంతంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేశ్, పవన్, చిరంజీవి, బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అదే విధంగా సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందిస్తూ ” సంక్షోభ సమయాల్లో అందరు కలిసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలని, ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వరదలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాయి మరియు బాధిత ప్రాంతాలకు సహాయాన్ని అందించడంలో మరియు పరిస్థితులు చక్కదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మా వంతు సాయంగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తరపున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు, రెండు స్టేట్స్ కు కలిపి రూ. 2 కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నామని, మా సహకారం కష్టాల్లో ఉన్న ప్రజల జీవితాల్లో అర్ధవంతమైన మార్పును కలిగిస్తుందని మేము ఆశిస్తున్నాము” అని తెలిపారు.