మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షా పదవి కోసం కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈసారి ఆ చర్చ మరింత వాడివేడిగా సాగుతోంది. ప్రకాష్ రాజ్ బృందం, మంచు విష్ణు బృందం ఎన్నికల్లో గెలిచేందుకు పోరాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ‘మా’ సభ్యులను ఆకర్షించడానికి తమదైన మార్గాలు అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని ‘మా’ ఎలక్షన్స్ పై చేసిన కామెంట్స్ పై సినీ పెద్దలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల నాని నటించిన “టక్ జగదీష్” విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాని ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలుగు పరిశ్రమలో ఏదైనా మార్చాలనుకుంటున్నారా ? అని అడిగినప్పుడు నాని ‘మా’ ఎన్నికలకు సంబంధించి నటులు ప్రెస్ మీట్లు, టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం తనకు నచ్చలేదని, వారు దానిని ఆపాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
Read Also : మహేష్ “దూకుడు”కు పదేళ్లు
నాని ఈ విషయం చెప్పిన చాలా రోజుల తర్వాత అది కొంతమంది పెద్దలకు చేరింది. వారు ఈ హీరో చేసిన కామెంట్స్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నాని ఎన్నికలలో పాల్గొనడం లేదని, ఆ పేద ‘మా’ సభ్యుల సంక్షేమం గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని సీనియర్లు భావిస్తున్నారట. అలాంటప్పుడు ఎన్నికల విధానాలు, ప్రచారం గురించి అతను ఎలా కామెంట్ చేస్తాడు అని అంటున్నారట. అయితే చాలామంది నాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే ‘మా’ ఎన్నికలు ప్రతిసారి అనవసరమైన రాజకీయ రంగును పులుముకుంటున్నాయి. దీనివల్ల చిత్ర పరిశ్రమ రెండు భాగాలుగా ముక్కలవుతోంది. ఈ విషయం చాలామంది మనసులో ఉన్నప్పటికీ నాని మాత్రం దానిని బహిరంగంగా వెల్లడించారు.