DGP Rajendranath Reddy : ఇద్దరు ఎస్పీల మధ్య.. సిబ్బంది బదిలీల చిచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Rajendranath Reddy : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఖాకీల బదిలీలు వారి మధ్య చిచ్చు పెట్టాయా? సమస్య డీజీపీ దగ్గరకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..!
ఈయన సిద్ధార్థ కౌశల్. కర్నూలు జిల్లా ఎస్పీ. ఈయనేమో రఘువీర్‌రెడ్డి. నంద్యాల జిల్లా ఎస్పీ. ఇద్దరు అధికారుల మధ్య పోలీసుల బదిలీలు పెద్ద వివాదానికి దారితీశాయి. అది పోలీస్ శాఖలో పెద్ద చర్చగా మారింది. సమస్య శ్రుతిమించకుండా పోలీస్ బాస్‌లు ఎలా పరిష్కరిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది.
Also Read
ASI నుంచి కానిస్టేబుల్ వరకు దాదాపు 66 మందిని బదిలీ చేస్తూ కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అది తన పరిధిలోని కర్నూలు జిల్లాకే పరిమితం కాకుండా.. పొరుగునే ఉన్న నంద్యాల జిల్లా నుంచి కొందరిని కర్నూలు జిల్లాకు.. కర్నూలు జిల్లా నుంచి మరికొందరిని నంద్యాల జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇదే సమస్యకు కేంద్రంగా మారింది. తమ జిల్లాలో కూడా కర్నూలు ఎస్పీనే బదిలీలు చేయడాన్ని నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి తప్పు పట్టారట. అంతేకాదు.. కర్నూలు జిల్లాకు బదిలీ అయిన నంద్యాల పోలీసులను రిలీవ్ చేయలేదట. అలాగే కర్నూలు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన వాళ్లను నంద్యాల జిల్లాలో విధుల్లోకి తీసుకోలేదట. సిబ్బంది ట్రాన్స్‌ఫర్లపై ఒక్క మాట చెప్పకుండా.. చర్చించకుండా.. ఏకపక్షంగా బదిలీ చేయడాన్ని డిపార్ట్‌మెంట్‌లోనూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
కర్నూలు ఎస్పీ సిద్ధార్థకౌశల్ ఉత్తర్వులపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారట నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి. దాంతో ఆ సమస్య ఏంటో పరిశీలించి… పరిష్కరించాలని కర్నూలు రేంజ్ పరిధిలోని ఉన్నతాధికారికి సూచించారట డీజీపీ. ఇక్కడే సమస్య మరో మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. బదిలీల వ్యవహారం పక్కన పెట్టి.. సమస్యను తన దృష్టికి తీసుకురాకుండా నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడంపై ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారట. పోలీస్ శాఖలో ఇది మరో రగడను రాజేసినట్టు సమాచారం. దీనిపై ఖాకీ వర్గాల్లోనే రకరకాలుగా చర్చ జరుగుతోందట. సమస్య వస్తే జిల్లా స్థాయిలో ఐపీఎస్‌లకు చెప్పుకొంటారని.. అదే ఐపీఎస్‌ల మధ్యే ఇబ్బందులు వస్తే ఎవరికి చెబుతారని కొందరు ప్రశ్నిస్తున్నారట.
ఈ సమస్యను ఎలా తెగ్గొడతారో కానీ.. బదిలీ అయిన సిబ్బంది పరిస్థితి గందరగోళంలో పడింది. కర్నూలు జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒకరిని ASIగా పదోన్నతి కల్పించి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోస్టింగ్ ఇచ్చారు ఎస్పీ సిద్దార్థ కౌశల్. తాజా గొడవలో ఆ బదిలీ డైలమాలో పడింది. జిల్లాల విభజన తర్వాత .. ఎక్కడికక్కడ HODలు వచ్చేశారు. వాళ్ల పరిధిలోనే పరిపాలన సాగుతోంది. కానీ.. సాంకేతికంగా కొన్ని చిక్కుముళ్లు అలాగే ఉండిపోయాయో ఏమో.. తాజా ఘటన పోలీస్ శాఖలోనే పెద్ద చర్చగా మారింది. మరి.. ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల మధ్య తలెత్తిన సిబ్బంది ట్రాన్స్‌ఫర్ల సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!