ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు శుభకార్యాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇంకోవైపు, కుటుంబ పెద్దలను, కుమారులను కోల్పోయినవారిని కూడా పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ వస్తున్నారు.. ఇక, ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం 5 .15కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో అరగంటపాటు గడపనున్నారు.. తిరిగి సాయంత్రం 6 గంటలకు తుమ్మలగుంట నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 6.15కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరనున్నారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, ఇవాళ ఉదయం నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్.. జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. ధర్మారెడ్డి కుమారుడి మృతితో దుఖఃసాగరంలో పారుమంచాల మునిగిపోయింది.. గుండెపోటుతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి భౌతికకాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే పారుమంచాలకు చంద్రమౌళి మృతదేహాన్ని తరలించారు.. చంద్రమౌళి భౌతికకాయాన్ని సందర్శించి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు.. మరోవైపు.. చంద్రమౌళి రెడ్డి మృతికి సంతాపంగా ఇవాళ మధ్యహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరుమలలో దుకాణాలు మూసివేయాలని స్థానికులు నిర్ణయించారు.. ఇక, ఏపీ ప్రభుత్వ విప్, చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఈ మధ్య కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడిన ఆయన.. సోమవారం రాత్రి హఠాత్తుగా ఊపిరి పీల్చడంలో ఇబ్బంది కలగడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్విమ్స్ కు తరలించారు. వైద్య బృందం తమ వంతు ప్రయత్నం చేశారు.. అయినా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న మణి రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించిన విషయం విదితమే.