ఇవాళ నంద్యాలలో బహిరంగ చర్చ కు సవాల్ చేశారు భూమా అఖిల ప్రియ. ఇప్పటికే భూమా అఖిల ప్రియ బహిరంగ చర్చపై నోటీసులు ఇచ్చారు పోలీసులు. బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ చేశారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ వద్ద చర్చకు రావాలని ఏర్పాట్లు చేశారు భూమా అఖిల ప్రియ. 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఈ బహిరంగచర్చకు అనుమతి లేదని, అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నందున ఎందుకు చర్య తీసుకోరాదని నోటీసుల్లో పేర్కొన్నారు. భూమా అఖిల ప్రియ వ్యక్తిగత సహాయకునికి కూడా నోటీస్ ఇచ్చారు పోలీసులు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి.
నంద్యాలలో రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ మంత్రి భూమా అఖిల చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. ఎమ్మెల్యే శిల్పా రవిని భూమా అఖిల చిక్కుల్లో పడేసిందంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిల నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు నంద్యాలలో హీట్ పెంచాయంటున్నారు. టీడీపీ లో, వైసీపీ లో చర్చకు తెరతీసాయంటున్నారు. భూమా అఖిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా.? రాజకీయ క్రీడలో భాగంగా శిల్పా రవి కుటుంబంపై వ్యాఖ్యలు చేసారా అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శిల్ప కుటుంబం టీడీపీపి వైపు చూస్తుందంటూ భూమా అఖిల సంచలన వ్యాఖ్యలు చేసి వదిలేశారు. వైసీపీలో శిల్పా కుటుంబ పరిస్థితి బాగాలేదని, పార్టీతో బంధం చెడిందని భూమా అఖిల మీడియా ముందు బయటపెట్టారు.
Read Also: Saturday Hanuman Stothram Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే
ఇప్పటికే టీడీపీ నేతలతో శిల్పా ఫ్యామిలీ టచ్ లో ఉందని, టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తూ ఆ పార్టీ నేతలను విమర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు. భూమా అఖిల. చంద్రబాబును తిడితే పార్టీలో ఎలా చేర్చుకుంటారని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధమని, 4 తేదీ సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ కు వస్తానని, ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు అఖిలప్రియ. భూమా అఖిల ఈ వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. భూమా అఖిలపై శిల్పా రవి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వారిని ఇబ్బందుల్లో పెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసారా అనే చర్చ జరుగుతోంది. ఆస్తుల ఆక్రమణ, భూదందా, సెటిల్మెంట్లు, పంచాయతీలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని, రెచ్చగొడితే మొత్తం చిట్టా విప్పుతానంటూ ఎమ్మెల్యే శిల్పా రవి పరోక్షంగా భూమా కుటుంబంపై ఆరోపణలు చేయడంతో ఈ స్థాయిలో భూమా అఖిల కౌంటర్ ఇచ్చారు.
నిజంగానే శిల్పా రవి కుటుంబం టీడీపీ నేతలతో టచ్ లో ఉందా అని చర్చ జరుగుతోంది. భూమా అఖిల వ్యాఖ్యలతో శిల్పా రవి సమాధానం చెప్పుకొలసిన పరిస్థితి వచ్చింది. భూమా అఖిల వ్యాఖ్యలతో శిల్పా రవి పై ఆరా కూడా మొదలయ్యింది. భూమా అఖిల చెప్పినట్టు తాము టీడీపీ లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటని శిల్పా రవి ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి భూమా వ్యాఖ్యలపై ఖండిస్తానని చెబుతున్నారట. భూమా అఖిలపై ఎదురుదాడికి రవి సిద్ధమవుతున్నారు. భూమా అఖిల నంద్యాల కేంద్రంగా ఇటీవల కార్యకలాపాలు తీవ్రం చేయడం కూడా చర్చకు దారి తీసిందట. నంద్యాలపై భూమా అఖిల కన్నేసారని , అందులో భాగంగా శిల్ప రవి వ్యూహాత్మకంగానే అఖిలను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారనే చర్చ జరుగుతోందంటున్నారు.
భూమా అఖిల కూడా నంద్యాల లో తిరిగి పట్టు సాధించే పనిలో ఉన్నారట. ప్రైవేట్ సంభాషణల్లో కూడా శిల్పా రవి కుటుంబం టీడీపీ లో చేరేందుకు మంతనాలు చేస్తున్నారని తన సన్నిహితులతో చెబుతున్నారట. శిల్పా రవి తండ్రి మోహన్ రెడ్డి 2014 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయారని, తిరిగి పచ్చ కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారంటున్నారు. అఖిల ప్రచారంతో శిల్పా రవి ఇరుకున పడుతున్నారట. మొత్తమ్మీద శిల్పా రవి, భూమా అఖిల ఆరోపణలు, ప్రత్యారోపణలతో నంద్యాల రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Read Also: Fire In Mumbai : ముంబైలో భారీ అగ్నిప్రమాదం, అదుపులోకి రాని మంటలు