Sivananda Reddy: ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు.. అరెస్ట్ భయంతో పరార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivananda Reddy: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు.. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తుండగా.. అయితే, మొదట నోటీసు ఇవ్వాలని కోరారట శివానందరెడ్డి.. ఇక, తెలంగాణ పోలీసులు నోటీసు తయారు చేస్తుండగానే.. వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారు శివానంద రెడ్డి.. అడ్డుకునే ప్రయత్నం హైదరాబాద్ పోలీసులు చేయగా.. దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోయారట శివానంద రెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ పోలీసులు.. శివానందెడ్డి వాహనాలు వెంబడించకుండా ఆయన అనుచరులు గేట్లు వేసినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
కాగా, హైదరాబాద్‌లో ఓ భూవివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు అల్లూరు వెళ్లారట సీసీఎస్ పోలీసులు.. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు టీడీపీ శ్రేణులు.. కాగా, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు మాండ్ర శివానందరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు.. ఈ తరుణంలో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధం కావడం.. ఆయన తప్పించుకుని పారీపోవడం చర్చగా మారింది. మరి ఈ కేసులో పోలీసులు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది చర్చగా మారింది. అయితే, హైదరాబాద్ లో భువివాదంలో క్రైమ్ నెంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీఎస్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!