Bunny Vasu Intresting Comments on Allu Vs Mega issues: అల్లు కాంపౌండ్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులలో బన్నీ వాస్ కూడా ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన చిన్న సినిమాల నిర్మాణం విషయంలో యాక్టివ్గా ఉన్నాడు. ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బన్నీ వాస్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం గురించి ఒక ప్రెస్ మీట్ లో స్పందించాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో నా పరిస్థితి మిక్సీలో వేసిన క్యారెట్ ముక్కల్లా అయిపోయింది.
Viraaji: వరుణ్ సందేశ్ సినిమాలో వేణు స్వామి?
ఏ బ్లేడ్ వచ్చి ఎప్పుడు కోస్తుందో తెలియట్లేదు. బయటికి మాత్రం జ్యూస్ వచ్చేస్తుంది అంటూ కామెంట్ చేశాడు. వాళ్ళందరూ కలిసి ఒక డిన్నర్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది అది కూడా ఒకేరోజులో అంటూ వాళ్ళ మధ్య ఏమీ లేదు ప్రాబ్లమ్ లేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం ఇప్పటిది కాదు. చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. దానికి తోడు అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త అంటూ శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి ఒక్కసారిగా కలకలం రేపారు. ఈ విషయం మీద అల్లు కాంపౌండ్ కి అనేక ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.