AP Crime: ఏపీలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య..!
- ఏపీలో మరో దారుణమైన ఘటన..
- తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య..
- నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఘటన..
- ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి..
- చిన్నారిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసిని మైనర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏపీలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. తొమ్మిదేళ్ల చిన్నారి.. ఆడుకుంటానని బయటకు వెళ్లింది.. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు తల్లిదండ్రులు.. కానీ, నాలుగు రోజులైంది.. జాడ తెలీలేదు. చివరికి ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేసారనే సమాచారంతో తల్లిదండ్రుల గుండెలు గుబేలుమన్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలిపనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది.. అయితే, ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడుందోనని వెతికారు, కనిపోయించలేదు. చీకటి పడింది.. అయినా జాడ దొరకపోవడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
Read Also: Israel: “గాజా సిటీని వెంటనే ఖాళీ చేయాలి”.. భారీ దాడికి సిద్ధమైన ఇజ్రాయిల్..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఇక, ఆ తరువాత రోజే ఎంపీ బైరెడ్డి శబరి విజయోత్సవ సభ నందికొట్కూరులో ఉండగా ఆమెకు బాలిక అదృశ్యంపై సమాచారం ఇచ్చారు. వెంటనే ఆచూకీ కనుక్కోవాలి పోలీసులను ఆదేశించింది. రెండు రోజులపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. మూడవ రోజు పోలీస్ జాగిలాలతో ముచ్చుమర్రిలో పరిశీలించారు. పోలీసు జాగిలం పార్కు వద్ద నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ముచ్చుమర్రి లిఫ్ట్ అప్రోచ్ కెనాల్ వరకు వెళ్లింది. బాలిక ఆడుకున్న పార్కులో విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టయిల్ లో విచారించారు పోలీసులు.. అందులో ఒకరు బాలిక వాసంతిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపు వారే.. ముచ్చుమర్రి కి చెందిన వారే. వారిని కాలువ వద్దకు తీసుకువెళ్లి ఎక్కడ పడేసింది చూపించమన్నారు. దర్యాప్తులో అప్పటికే చీకటి పడడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం కలిగింది. మరుసటి రోజు ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో బాలిక మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఎంపీ బైరెడ్డి శబరి కూడా కాలువలో బోటులో వెళ్ళింది. ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎస్పీ రఘువీర్ రెడ్డి గాలింపును పర్యవేక్షించారు.
Read Also: Crime: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యపై సవతి కొడుకు అత్యాచారం..
అయితే, బాలికపై అత్యాచారం, హత్యపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అభం, శుభం ఎరుగని చిన్నారిపై ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలికపై జరిగింది దారుణమన్నారు ఎమ్మెల్యే జయసూర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారాయన. నందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలనారు. నా బిడ్డను చంపిన వాళ్ళను ఎన్ కౌంటర్ చేసి చంపాలన్నారు వాసంతి తల్లి సుజాత. తండ్రి మద్దిలేటి.. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వాసంతి నానమ్మ వాపోయింది. పనీపాటా లేకుండా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నారన్నారు అంటూ కన్నీరుమున్నీరైంది.. ఇలాంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. మేం అనుభవిస్తున్న బాధ వాళ్ల తల్లిదండ్రులు కూడా అనుభవించాలని శాపనార్థాలు పెట్టారు. రౌడీలు పెట్రరేగిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. గాంజాయి పిల్లలకు కూడా చేరుతోందన్నారాయన. బాలిక తల్లిదండ్రులను ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంపీ బైరెడ్డి శబరి. ఇక, బాలికపై అత్యాచారం, హత్యపై పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడించేందుకు ఎస్పీ రఘువీర్ రెడ్డి నిరాకరించారు. కేసు దర్యాప్తులో వుందన్నారు ఎస్పీ.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!