నంద్యాలలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తను భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన వెంకటేశ్, మమత భార్యాభర్తలు. వెంకటేష్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు నెలకొన్నాయి.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ కసాయి మొగుడు. మద్యం మత్తులో భార్య సుగుణమ్మ (48) ను కిరాతకంగా గొడ్డలితో హత్య చేశాడు భర్త వడ్డే రమణ.
నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్‌లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.
నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి హరికుమార్ గౌడ్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.