Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఆయన ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల…
ఏపీలో పదో తరగతి పరీక్షల సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తొలిరోజు తెలుగు, రెండో రోజు హిందీ పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడో రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో టెన్త్ పేపర్ లీక్ అయ్యిందని వార్తలు హల్‌చల్ చేశాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్కూల్ అటెండర్ ద్వారా పేపర్…
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లు…