నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షో.. అన్ స్టాపబుల్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన రెండు ఎపిసోడ్లు అల్టిమేట్ రేటింగ్ తెచ్చుకున్నాయి. బాలకృష్ణ పంచ్ లు, జోకులతో షో అంతా దద్దరిల్లింది. మొదట మోహన్ బాబు, ఆ తరువాత నానితో బాలయ్య రచ్చ రచ్చ చేశారు. ఇక మూడో ఎపిసోడ్ లో బాలయ్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే ఆహా వారు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అందుతున్న…
నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’.. నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూ కొనసాగుతోంది. బాలయ్య బాబు హోస్టింగ్ అదిరిపోవడంతో నెక్స్ట్ ఏ గెస్ట్ రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ సందడి చేయగా.. రెండో ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని హంగామా చేశాడు. బాలయ్య బాబు పంచ్ లు, నాని జోక్ లతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకొంది. ఇక ఈ రెండు ఎపిసోడ్స్ తో ఈ షో పై…
‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన బాలకృష్ణ, బోయపాటి కాంబో… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘అఖండ’తోనూ అదే పని చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అఘోరగా బాలకృష్ణ గెటప్ అదరహో అన్నట్టుగా ఉంది. ఆ గెటప్ మీద చిత్రీకరించిన ‘భం అఖండ, భం భం అఖండ’ అనే టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా చిత్ర బృందం…
మాస్ మసాలా చిత్రాలకు పేరుగాంచిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ డ్రామా “అఖండ”. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . నందమూరి అభిమానులకు దీపావళి గిఫ్ట్ గా అఖండ టైటిల్ సాంగ్ రోర్ అంటూ…
నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆరునెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 31న కేర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సోమవారం బాలయ్యకు డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అయ్యిందని, ఆయనకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలయ్య నేడు డిశ్చార్జ్ కానున్నారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్యులు…
అకాల మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఆయనకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలకడానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. నిన్న కర్ణాటక సీఎం బొమ్మై ఆసుపత్రిలోనే పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఈరోజు సినీ ఇండస్ట్రీ…
ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా…
నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ.. కరోనా వేవ్ తర్వాత వేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ నిన్న ముగిసింది. కాగా, నేడు చిత్రబృందం కాస్త రిలాక్స్ అవుతూ పార్టీ చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. కాగా దీపావళి సందర్బంగా ఈ చిత్ర రానున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య…
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొంది. టాలీవుడ్ ప్రముఖుల హోస్టింగ్, ఇంటర్వ్యూలతో పాటు కొత్త సినిమాలతో ‘అహ’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా, తాజా సమాచారం ప్రకారం నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకి హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటారని సమాచారం.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్ర షూటింగ్ నేటితో ముగిసింది.…