నందమూరి ఫ్యామిలీలో నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వారసత్వంగా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాత్రం తీరని అగాధం నెలకొంది అన్నది విషయం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ను బాలయ్య చేరదీసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక మళ్ళీ చాన్నాళ్లుగా వీరిద్దరికీ గ్యాప్ ఏర్పడింది. నందమూరి అభిమానులు కూడా చాలా కాలంగా బాలయ్య, ఎన్టీఆర్ కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట రావడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది.
Read Also : నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త … త్వరలో భక్తి టీవీ స్టార్ట్
తాజాగా బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిశ్రమకు సహకరించారు. ఇక త్వరలో విడుదల కాబోతున్న సినిమాలు అంటూ మన రామ్ చరణ్, మన జూనియర్ ఎన్టీఆర్… అంటూ ఆయన నోట్లో నుంచి మాట రాగానే స్టేడియం నందమూరి అభిమానుల అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. ఇక ఇటీవల వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు భార్యపై కామెంట్స్ చేయగా, బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై ఎన్టీఆర్ కూడా స్పందించడం విశేషం.