ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాలో పోటాపోటీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, సంక్రాంతి రేసులో బడా సినిమాలు భారీగా పోటీ పడుతున్నాయి. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ కూడా అందులో ఓ భారీ మూవీ. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య పోటాపోటీగా విడుదలవుతున్న బడా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !
తమ్ముడు అల్లు అర్జున ‘పుష్ప’, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి గారి ‘ఆచార్య’ విడుదల కాబోతోంది. త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలు హిట్ కావాలని కోరుకున్నారు బాలయ్య. అంతేకాదు దర్శకుడు రాజమౌళిపై కూడా ప్రశంసలు కురిపిస్తూ ఆయన దేశవ్యాప్తంగా ఉన్న టాప్ డైరెక్టర్ కాదని, ప్రపంచవ్యాప్త డైరెక్టర్ అని అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ సమస్యలపైనా ‘అఖండ’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రభుత్వాలూ సినిమా పరిశ్రమకు సహకరించాలని కోరారు.