నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే ఫుల్ గా హైప్ పెంచేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ సినిమా కథ గురించి తన పరిశోధనల అనంతరం స్క్రిప్ట్ ను…
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటుడితో పాటు మిగతా నటీనటులు కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సమాచారం ప్రకారం స్టంట్ కొరియోగ్రాఫర్ శివ ఒక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇది…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మలినేని గోపీచంద్ తో బాలకృష్ణ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా వార్త వచ్చింది.…
నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నెట్స్ట్ తాను చేయబోయే వరుస సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం బోయపాటి “అఖండ”లో నటిస్తున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉండబోతోందని వెల్లడించారు. అలాగే ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం, హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. Read Also : ‘మా’…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నికల్లో స్పందించని నటీనటులు సైతం ఈసారి దూకుడు పెంచారు. అయితే.. తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోననని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత…
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రోగులకు సేవలు అందించే విషయంలో మరో ముందడుగు వేసింది. బుధవారం ఒకటో నంబర్ బ్లాక్ సెల్లార్ లో కొత్త డే-కేర్ యూనిట్ 3ని హాస్పిటల్ కమిటీ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కిమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్స్ కు సేవలు అందించడంలో తమ సంస్థ మరో మైలు రాయిని అధిగమించిందని ఆయన అన్నారు. తమ ప్రయాణంలో నిరంతరం సేవలను మెరుగుపరుచుకుంటూ, మరిన్ని సౌకర్యాలను పేషెంట్స్…
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో “ఆదిత్య 369” సినిమా ఎప్పటికీ మరిచిపోలేనిది. టైం ట్రావెల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. అయితే ఆ సినిమా షూటింగ్ లో నడుం విరిగింది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సినిమా విషయం ఎందుకు వచ్చిందంటే…. తాజాగా బాలయ్య అనారోగ్యం పాలైన తన అభిమానిని పరామర్శించారు. ఆ అభిమాని పేరు మురుగేష్. అతను శాంతిపురం మండలం గొల్లపల్లిలో నివసిస్తున్నాడు. ఇటీవల చెట్టుపై నుంచి పడి…
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హీరోగానే కాక, ఎమ్మెల్యేగానూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న బాలయ్య నుంచి స్ఫూర్తి పొంది అభిమానులు కూడా అదే తరహాలో ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఇందుకోసం కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య అభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ…
నేడు నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు విషెస్ తెలియచేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కూడా రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య-బోయపాటి సినిమా ‘అఖండ’ నుంచి న్యూ పోస్టర్ విడుదల కాగా.. ఆయన తదుపరి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటిస్తూ వీడియో విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ..…