సెంటిమెంటును బ్రేక్ చేసిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “అఖండ” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సెంటిమెంట్ ను బాగా నమ్మే బాలయ్య ఈసారి మాత్రం ‘అఖండ’కు సంబంధించి ఓ సెంటిమెంటును బ్రేక్ చేశారు.
Read Also : బాక్స్ ఆఫీస్ పై ‘అఖండ’ దండయాత్ర… ఒక్కరోజులోనే చరణ్ రికార్డు బ్రేక్
Also Read
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
తన సినిమా ఏదైనా విడుదలైనప్పుడు బాలయ్య చిత్ర బృందంతో కలిసి తరచుగా హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో ఫస్ట్ షోను వీక్షిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఆయన ‘అఖండ’ను చూడడానికి థియేటర్ కు వెళ్ళలేదు. ఈరోజు ఉదయం నుంచి ‘అఖండ’ ప్రభంజనం కొనసాగుతోంది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇతరులతో కలిసి భ్రమరాంబ థియేటర్లో సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ స్పందనను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అయితే అక్కడికి బాలయ్య వస్తాడని ఊహించిన అభిమానులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురయ్యింది. అయినప్పటికీ బాలయ్య చేతికి సర్జరీ జరగడం కారణంగానో, లేదంటే బిజీగా ఉండడం వల్లనో రాలేకపోయి ఉంటారని సర్ది చెప్పుకుంటున్నారు నందమూరి అభిమానులు.
Read Also : బాలయ్య ఫ్యాన్స్ కు షాక్… ‘అఖండ’ షో ఆపేసిన పోలీసులు
ఇక సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమా ఎప్పుడు వచ్చినా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. సినిమా రిలీజ్ రోజు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి, పాలాభిషేకం, పోస్టర్ల ముందు కొబ్బరికాయలు కొట్టడం వంటి పనులు చేస్తుంటారు. అయితే ఆ పండగ వాతావరణం ఇప్పుడు ‘అఖండ’ విషయంలో కన్పిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం ‘అఖండ’ మేనియా కొనసాగుతోంది. తారలు మారినా సినిమా థియేటర్ల వద్ద ఆయన తెచ్చే పండగ మారదు అంటూ బాలయ్యను ఆకాశానికెత్తేస్తున్నారు ఆయన అభిమానులు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!