సినీ అభిమానములంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక మొన్నటి వరకు చేసిన ప్రమోషన్స్ ఒక ఎత్తు.. ఇప్పుడు చేయబోయే ప్రమోషన్స్ ఒక ఎత్తు అన్నట్లు ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్…
నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK107’ అనే తాత్కాలిక టైటిల్తో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి లీకైన పిక్స్, అధికారికంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన నెటిజన్లు ‘NBK107’ కన్నడ హిట్ ‘మఫ్టీ’ నుండి కథ నుంచి ప్రేరణ పొందింది అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు కొంతమంది డైరెక్ట్ గా చిత్రబృందాన్ని ట్యాగ్ చేస్తూ దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. తాజాగా…
నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని,…
అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని బాలయ్య లుక్ లీకైన విషయం తెల్సిందే. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన మేకర్స్ లీకులను ఎంకరేజ్ చేయకుండా బాలయ్య…
నందమూరి బాలకృష్ణ మొదటిసారి ఏపీ టికెట్ రేట్స్ వివాదంపై నోరు విప్పారు. మంగళవారం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ని వేధిస్తున్న టికెట్ రేట్స్ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ ని కలిసి చర్చించిన సంగతి తెల్సిందే. ఇక ఆ భేటీకి నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు.. ఆయనను ఆహ్వానించలేదా అని అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఇక తాజాగా…
నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెండవ చిత్రం ‘ధర్మక్షేత్రం’. ‘రక్తాభిషేకం’ను మ్యూజికల్ హిట్ గా నిలిపిన ఇళయరాజా, ఈ చిత్రానికి కూడా స్వరకల్పన చేసి, దీనిని మ్యూజికల్ హిట్ గా మలిచారు. 1992 ఫిబ్రవరి 14న ‘ధర్మక్షేత్రం’ జనం ముందు నిలచింది.…
‘ఆహా’లో మొన్నటి వరకూ ప్రసారమైన బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ టాక్ షో కు చిరంజీవి కూడా హాజరవుతారని, న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి పర్వదినాల్లో ఆ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని బయట బోలెడు చర్చ జరిగింది. కొందరైతే బాలకృష్ణ షో తొలి ఎసిపోడ్ గెస్ట్ అసలు చిరంజీవే అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ లో ప్రసారమైన పదకొండు…
ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని, ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ…
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు చెప్పారట.. ఈ విషయాన్నీ వెల్లడించారు. ఇటీవల మహేష్ బాబు, బాలయ్యబాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ షోలో బాలయ్య, మహేష్ నుంచి గట్టి సీక్రెట్ లనే రాబట్టారు. ఆయన పెళ్లి దగ్గర నుంచి ఆయన సినిమా షూటింగ్ మధ్యలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ల…
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొందరు.. జిల్లా కేంద్రం కోసం మరొకరు.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇంకొద్దరు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒకటి అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సత్యసాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్షకు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని రకాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో…